Saturday, August 31, 2013

భారతీయులు డైటింగ్ చెయ్యాలోచ్!!!

     భారతీయులు డైటింగ్ చెయ్యాలోచ్!!!

       ఇక నుండి ఏడాక్టరు సలహా లేకుండా ప్రతి భారతీయుడు డైటింగ్ చెయ్యాలండీ!!! ఎందుకంటారా.. మాట వినగానే "కడుపు" మండిపోయి ఒక రకమైన బెంగ వచ్చేస్తోంది కదా!!! మరే!! మరి మన రూపాయేమో రోజు రోజుకీ దిగజారిపోయి అధ` పాతాళానికి  తొక్కివేయబడుతోంది. డైటింగ్ అని రూపాయి కథ చెపుతారేంటి అని విసుక్కోకండి!! అక్కడే ఉంది అసలైన కిక్.

   బంగారం దిగుమతి చేసుకోవటం లో భారతీయులకు భారతీయులే  సాటి. అది మనకో సెంటిమెంట్. రూపాయి క్షీణత పుణ్యమా అని ఒక పక్క ద్రవ్య లోటు పెరిగిపోతోంది. దీన్ని ఆపాలంటే పుత్తడి జోలికి పోవద్దు అని ఇటు ప్రధాని, అటు విత్త మంత్రి మన చెవుల్లో ఇళ్ళు కట్టుకుని చెప్తున్నారు.(కొన్ని రకాల ఎలక్త్రానిక్ వస్తువుల జోలికి  పొవద్దని మాత్రం చెప్పలేదు, ఎందుకో మరి వారికే తెలియాలి). "ఉరిమి ఉరిమి మంగళం మీద పదినట్లు" ఇదే కారణం  అని కూడా అంటున్నారు. అవునా కాదా అన్న విషయం పక్కకి పెడితే, దీన్ని కట్టడి చేస్తే లోటుని నిలువరించవచ్చు అని ఆలోచన!! కాదని అనలేం!!

    ఇక వ్యవసాయం విషయానికి వస్తే, ప్రకృతి కన్నెర్ర చేయతం ఒక ఎత్తైతే , ఆహార,ఉద్యోగ భద్రతలు వచ్చేసి సగటు రైతుకి కులీలు దొరకటం లేదు!! దొరికినా మూలిగే నక్కపై తాటిపండు అన్న చందాన కూలి చెల్లించలేకపొతున్నాడు. దీనితో కనీసం పొలంలో కలుపు తొలగించుకోలేని రైతు పంట పండించటం మానేసి తన పొలాన్ని రియల్ ఎస్టేటుగానో మారుస్తున్నాడు. ఏదీ కాకపోతే ప్రభుత్వమే ఏదొ సెజ్ అని నామకరణం చేసేసి భూములను స్వాధీనం చేసుకుంటోంది. యువత గ్రామల్లో అవకాశాలు లేక, పట్టణాలకు పరుగు పెడుతున్నారు. ఇది ఇలాగే కొనసాగితే మన కమతాల పరిమాణం మరింత కుదించుకునిపోయి, ఇక పూర్తిగా ఆహార దిగుమతులపైనే మనం అధారపడే  ప్రమాదం ఉంది. అంటే మళ్ళీ "ద్రవ్య లోటు" మొదలైనట్లే కదా!!! మరి లోటుని పూరించాలంటే మనం అన్నం తినటం తగ్గించుకోవాలి లేదా మానెయ్యాలి కదా...!! ఎంచక్కా ఇక డాక్టరు సలహా లేకుండానే మనం "డైటింగ్" చేసుకోవచ్చన్న మాట!!
ఇదండీ సంగతి.!!!

@@@@






No comments:

Post a Comment