Friday, August 2, 2013

manasulo maata

భాషలందు తెలుగు లెస్స అన్నారు ..
"ఇటాలియన్ ఆఫ్ ది ఈస్ట్ " అన్నారు ... (**తెలుగు కి వున్నా బిరుదు ఇటాలియన్ ఆఫ్ ది ఈస్ట్ )
ఈరోజు "ఇటలియన్ " బెస్ట్ అన్నారు!!!!
 
                 సెగ పెట్టాడు తెల్లోడు ఆనాడు ..
                 "విభజించు పాలించు" అని!!
                 గుండెలని చీల్చారు ఈనాదు...
                అదే "తెల్ల" వేషం వేసి!!!!

 తెల్లబోవడం తెలుగోడి వంతు .
సీట్ల లెక్కింపు పార్టీల వంతు .
అది తెలంగాణమైనా ...సమైక్యమైనా !!!

               "బుందేలు " రేపు కుందేలు కాదా??
              "విదర్భ" విధ్వంసం సృష్టించబో దా ???
              "హరిత " రక్తపాతం కాదా?
               "గూర్ఖా" లు గుండాలు కారా?
               ఆగేదెన్నడు ???ఆపేదెవ్వరు ????


శంఖం లో నుండి పోస్తేనే తీర్థం ...
విదేశీ వచ్చి చెపితేనే వేదం !!!
ఆవేశాలు ఉద్యమాలు కాదు!!
అనాలోచిత కార్యాలు నిర్ణయాలు కాదు!!

                    తెలుగు తల్లికి ఒక చెల్లంటూ సవతినిచ్చారు .... !!!!
                   ఎవరో కాదు...
                     అక్షరాలా మన ప్రతినిధులు!!
                    సీట్లనే ముక్కలకు,
                   పదవులనే బిస్కట్లకు కక్కుర్తి పడి !!!
@@@@@@@

No comments:

Post a Comment